త్వరలో అదుపులోకి రానున్న పోస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
న్యూఢిల్లీ: పోస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం అందుకు గాను రూ.1300 కోట్లను కేటాయించనుంది. ఈ నెలలో సమావేశమయ్యే ఫైనాన్స్ కమిషన్ పోస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేటాయించాల్సిన నిధులపై తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. తపాలా శాఖ బ్యాంకు లైసెన్సు కోసం రిజర్వు బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది. అనుమతులు అన్నీ పొందగానే తొలుత 50 శాఖల నుంచి బ్యాంకింగ్ సేవలు అందించాలని తపాలాశాఖ భావిస్తోంది. ఐదేళ్లలో 150 శాఖలకు విస్తరించాలన్నది లక్ష్యం.