పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఉభయ సభల్లో గందరగోళం సృష్టించారు. లోక్‌సభలో ఆహార భద్రతా బిల్లుపై సామాజిక  న్యాయశాఖ మంత్రి కుమారి షెల్లా మాట్లాడుతుండగా సీమాంధ్ర సభను మాట్లాడుతుండగా సీమాంధ్ర ఎంపీలు ఆందోళనకు దిగారు. చేసేది లేక లోక్‌సభ స్పీకర్‌ సభను రేపు ఉదయం పదకొండు గంటల వరకు వాయిదా వేశారు.  రాజ్యసభలో రాష్ట్ర విభజన కోసం కేంద్ర కేబినేట్‌ బిల్లు ముసాయిదాను తయారుచేసిందని మంత్రి చిదంబరం ప్రకటించగానే మళ్లీ సీమాంధ్ర ఎంపీలు ధర్నాకు దిగారు. దీంతో ఛైర్మన్‌ స్థానంలో ఉన్న కురియన్‌ వారిని వారించి సభను రేపటికి వాయిదా వేశారు.