తెలంగాణపై బీజేపీది ద్వంద్వ వైఖరి: దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై బీజేపీ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తుందని ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నరేంద్రమోడి చేసిన ఆరోపణలు అవాస్తవాలేనని పేర్కొన్నారు. 2001 లో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తే  మీరేం చేశారని, తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ఆయన బీజేపీని ప్రశ్నించారు. ఏపీఎన్టీవోలు, విద్యార్థులు, ఉద్యోగులు, సమ్మెలు, ఆందోళనలు విరమించాలని కోరారు. మీ అభ్యంతరాలు ఆంటోని కమిటీకి చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఎల్లుండి ఆంటోని కమిటీ తొలి సమావేశం అవుతుందని దిగ్విజయ్‌సింగ్‌ చెప్పారు.