గాయాలతో ఆసియాకప్‌కు సీనియర్లు దూరం
న్యూఢిల్లీ ,ఆగష్ట్ 12 (జనంసాక్షి):
వచ్చే వారం మలేషియాలో జరగనున్న ఆసియాకప్ కోసం భారత హాకీ జట్టును ప్రకటించారు. పలువురు సీనియర్లు గాయాల కారణంగా తప్పుకోవడంతో యువ ఆటగాళ్ళకు చోటు దక్కింది. పూర్తిగా యువఆటగాళ్ళతో కూడిన ఈ జట్టుకు సర్థార్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించ నున్నాడు. డ్రాగ్‌ఫ్లికర్ విఆర్ రఘునాథ్ స్థానంలో గోల్‌కీపర్ శ్రీజేష్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. అయితే కీలకమైన ఆటగాళ్ళు గాయాలతో దూరమవడం భారత్ అవకాశాలపై ప్రభావం చూపనుంది. దినేష్ ముజ్తాబా, ఎస్‌వి సునీల్, గుర్విందర్‌సింగ్ చాంది, ఆకాష్‌దీప్‌సింగ్ గాయాల కారణంగా అందుబాటులో లేకపోయిన ప్పటకీ యువ జట్టు రాణిస్తుందని కోచ్ ఆల్ట్‌మాన్స్ ధీమాగా ఉన్నాడు. బెంగళూర్‌లో జూలై 25 నుండి 27 వరకూ నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్ ద్వారా ఈ జట్టును ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే ఆగష్ట్ 24 నుండి మొదలుకానున్న ఆసియాకప్‌లో భారత్ గ్రూప్ బిలో చోటు దక్కించుకుంది. ఇదే గ్రూప్‌లో కొరియా, బంగ్లాదేశ్, ఒమన్ ఉండగా… గ్రూప్ ఎలో పాకిస్థాన్, మలేషియా, జపాన్, చైనీస్ తైపీ చోటు దక్కించు కున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడనుండగా తర్వాత కొరియాతోనూ , బంగ్లాదేశ్ తోనూ ఆడనుంది. 2014 ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే భారత్ ఈ టోర్నీలో గెలిచి తీరాలి.
ఆసియాకప్‌కు భారత హాకీ జట్టు :
గోల్ కీపర్లు – పిఆర్ శ్రీజేష్, పిటి రావు
డిఫెండర్స్ – విఆర్ రఘునాథ్, రూపేందర్‌పాల్‌సింగ్, అమిత్ రొహిడాస్, కొతాజిత్‌సింగ్, బీరేంద్ర లక్ర, గుర్మైల్ సింగ్
మిడ్‌ఫీల్డర్వు – సర్ధార్‌సింగ్ (కెప్టెన్), మన్‌ప్రీత్‌సింగ్, చింగ్లెన్సానాసింగ్, ధర్మవీర్‌సింగ్, ఎస్‌కె ఊతప్ప.
ఫార్వార్డ్స్ – రమణదీప్‌సింగ్, నితిన్ తిమ్మయ్య, మణ్‌దీప్‌సింగ్, మాలక్‌సింగ్, నికిల్ తిమ్మయ్య