ఆసిన్-ఎతో భారత్-ఎ ఫైనల్ నేడే
ప్రిటోరియా: ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో భారత్ నేడు ఆస్ట్రేలియా-శ్రీతో తలపడనుంది. ఆతిధ్య దక్షిణఫ్రికా-ఎను ఇంటి ముఖం పట్టించి ఫైనల్‌కు చేరిన భారత్-ఎ జట్టు జోరుమీదుంది. అయితే లీగ్ దశలో ఆస్ట్రేలియాతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడటం పుజారా సేనకు ప్రతికూలాంశం. భారత్‌కు బ్యాటింగ్‌తో ఇబ్బంది లేదు. ఫైనల్లో బౌలింగ్ ప్రదర్శన మీదే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.