చెప్పులతో దాడి చేయడం హేయమైన చర్య : దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): తిరుమలలో తెలంగాణ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంతరావును సీమాంధ్ర ఉద్యమకారులు అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ తీవ్రంగా ఖండించారు. హనుమంతరావుపై రాళ్లతో, చెప్పులతో దాడి చేయడం హైయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా వారి అభిప్రాయాలను స్వేచ్చగా చెప్పుకోవచ్చని, అడ్డుకోవడానికి ఎవరికీ హక్కులేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కొత్తపార్టీ పెడతారని కదా అని విలేకరులు ప్రశ్నించగా అదంతా మీడియా కథనాలని కొట్టి పడేశారు.