ఎంసెట్ కౌన్సెలింగ్ అడ్డుకోవద్దు: దిగ్విజయ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎంసెట్ కౌన్సెలింగ్ అడ్డుకోవద్దని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రుల సమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. అందరి అభిప్రాయాలను ఆంటోని కమిటీ సావధానంగా వింటుందన్నారు.