బాలిక పై అత్యాచారం టైతో ఉరి బిగించి హత్య
పుణె : ఐదో తరగతి చదువుతున్న ఓ బాలిక ఒంటరిగా ఇంటికెళ్తుండడం గమనించిన యువకుడు ఆమెను బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అమె యూనిఫాంకున్న యూనిఫాంకున్న టైతోనే గొంతుకు ఉరి బిగించి హత్య చేశాడు. పోలీసులు తీవ్రంగా అన్వేషించి నిందితుడిని అరెస్టు చేశారు. కుమార్తెను రోజూ తానే ఇంటికి తీసుకెళ్లేవాడినని, ఆరోజు వీలు కాకపోవడంతో పాప నడిచివస్తూ ఈ దారుణానికి బలైందని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పుణెకు 100 కి,మీ. దూరంలో గలంద్‌వాడి గ్రామంలో జరిగిందీ దారుణం. ప్రశాంతంగా ఉండే తమ గ్రామంలో ఇలాంటి సంఘటన జరగడం గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. నేరస్థులకు చట్టం పట్ల భయం ఉండడం లేదని, రెండు మూడెళ్లు జైలులో ఉండి బయటకు వచ్చి మళ్లీ అవే నేరాలు చేయడానికి వెనకాడడం లేదనా గ్రామ పెద్దలు ఆరోపింస్తున్నారు.