నిందితులను వీలైనంత త్వరగా శిక్షిస్తాం : షిండే
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముంబయి ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి వీలైనంత త్వరగా నిందితులకు శిక్షపడేలా చూస్తామని కేంద్ర హోం మంత్రి షిండే అన్నారు. సోమవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ 20 బృందాలతో గాలించి ముంబయి పోలీసులు నిందితులను పట్టుకున్నారని తెలిపారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు తప్పు ఒప్పుకున్నట్లు ఆయన సభకు వివరించారు.