తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దు : శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్,(జనంసాక్షి): సెప్టెంబర్ 7 న సమైక్య సభ పెడితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని తెలంగాణ ఉద్యోగ సంఘం నేత శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. ఏపీ ఎన్టీవో అధ్యక్షుడు అశోక్‌బాబు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. సమైక్య సభ పెడితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.