ఆధార్‌ గడువు పొడిగించండి : సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): గ్యాస్‌ రాయితీకి ఆధార్‌ అనుసంధానం గడువును పొడిగించాలని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తొలి విడతగా ఈ పథకాన్ని అమలు చేయనున్న ఐదు జిల్లాల్లో కేవలం 45 శాతం మాత్రమే ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ పూర్తయిందని ఆయన లేఖలో స్పష్టం చేశారు.