భయం బూచీతో తెలంగాణ అడ్డుకుంటే సహించం


సీఎం సీమాంధ్ర తొత్తులా వ్యవహరిస్తున్నడు : కోదండరామ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) :
భయం బూచీతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటే సహించబోమని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తమకు భయం ఉందని గగ్గోలుపెడుతూ తెలంగాణను అడ్డుకు నేందుకు సీమాంధ్ర పెట్టుబడి దారులు కుట్ర పన్నుతున్నా రని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో న్యూడెమెక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పచ్చి అవకాశవాదిలా వ్యవహ రిస్తున్నాడని దుయ్యబట్టారు. హైదరాబాద్‌ గడ్డమీద ఉండి కిరణ్‌ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తనలో అనువనువునా సమైక్య రక్తం ప్రవహిస్తోందని, తెలంగాణపై పూర్తి ఉక్కుపాదం మోపిన ఆయన నేడు మరీ రెచ్చిపోయి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌ రవంపై దెబ్బతీస్తున్నాడని విమర్శించారు. తన మాటలను మానుకోక పోతే మాత్రం అది కాంగ్రెస్‌ పార్టీకే నష్టం తెచ్చిపెడుతుందన్నారు. సీమాంధ్రలో ఎలాగూ వైఎస్‌ఆర్‌సిపిని ఎదుర్కోలేక దాసోహం అవబోతున్న పార్టీని రక్షించే శక్తి లేక నేడు తెలంగాణలో కూడా పార్టీని నిండా ముంచాలనే ఉద్దేశ్యంతో వ్యవహరిస్తున్నట్లుగా ఉందన్నారు. తెలంగాణలో సకల జనుల సమ్మె జరిగినప్పుడు అంతా కేంద్రమే చూసుకుంటుందని మౌనంగా ఉన్న కిరణ్‌ నేడు మాత్రం నోరుపారేసుకుంటూ రెచ్చగొట్టలే వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. చర్చల పేరుతో కాంగ్రెస్‌ కాలయాపన చేస్తోందని కోదండరామ్‌ ఆరోపించారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు పెట్టి ఆమోదింప చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీఎం ఇప్పటికైనా ప్రేలాపణలు మానుకోవాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల నాలుగు దశాబ్దాల పోరాటం ఫలించబోయే వేళ అడ్డుకోవాలని చూసే శక్తులను ఊపేక్షించబోమని అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని కోరారు.