స్వామిగౌడ్‌ ఇంట్లో భారీ చోరి

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ నేత ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ ఇంట్లో చోరి జరిగింది. రాజేంద్రనగర్‌లోని ఆయన నివాసం నుంచి దొంగలు భారీ ఎత్తున సొమ్మును దోచుకెళ్లారని తెలుస్తుంది. ఈ మేరకు ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.