వచ్చే ఫిఫా వరల్డ్ కప్‌ను బ్రెజిల్ గెలుస్తుంది
మారడోనా
బ్యూనోస్‌ఏరిస్: వచ్చే సంవత్సరం బ్రెజిల్‌లో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్‌ను బ్రెజిల్ జట్టు గెలుచుకుంటుందని పుట్‌బాల్ దిగ్గజం మారడోనా తెలిపారు. 1986 ఫిఫా వరల్డ్ కప్ విజేత అయిన డీగో మారడోనా వచ్చే ఏడాది జూన్ 12 నుంచి జులై వరకు జరిగే ఈ టోర్నమెంటులో యూరోపియన్ దేశాలు అంతగా రాణించలేవని మారడోనా జోస్యం చెప్పారు. ప్రపంచకప్‌లో బ్రిజిల్‌కు సాటిరాగల దేశాలే లేవన్నారు.