యూరోప్‌లో అతిపెద్ద గ్రంథాలయాన్ని ప్రారంభించిన మలాలా

లండన్‌ : తాలిబన్ల కాల్పులకు గురై తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన పాకిస్థానీ బాలిక మలాలా యూసుఫ్‌జాయ్‌ ఈరోజు యూరోప్‌లోనే అతి పెద్ద గ్రంధాలయాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించింది. బర్మింగ్‌హామ్‌లో ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఇంగ్లండ్‌కి గుండెకాయ లాంటి ఈ నగరం తనకు ప్రాణదాత కూడానని పేర్కొంది. కాల్పులకు గురైన ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో చికిత్సకు ఇక్కడికే తరలించిరు. ఇంత పెద్ద గ్రంథాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానిచారంటే ఈ నగర పౌరులు తనని ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతోందని, తనకీ వారంటే అంతే ప్రేమ అని మలాలా చెంప్పింది.