రామగుండం ఎన్టీపీసి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

గోదావరిఖని (కరీంనగర్‌) : కరీంనగర్‌ జిల్లా రామగుండం ఎన్టీపీసిలో గుర్తింపు కార్మికసంఘం ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఉదయం పోలింగ్‌ ప్రారంభమైంది. ఐదు కార్మిక సంఘాలు పోటి చేస్తున్న ఈ ఎన్నికల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 833 ఓట్లు ఉండగా ఉదయం 8గంటల వరకు 130 ఓట్లు పోలయ్యాయి. కేంద్ర కార్మికశాఖ అసిస్టెంట్‌ కమీషనర్‌ నర్సయ్య పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఫలితాలు సాయంత్రం వెలువడనున్నాయి.