నల్లబ్యాడ్జీలతో సింగరేణి కార్మికుల నిరసన

గోదావరిఖని : తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల బంద్‌ నేపథ్యంలో భాగంగా సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కరీంనగర్‌ జిల్లా రామగుండం ప్రాంతంలోని పది భూగర్భగనులు ,నాలుగు ఉపరితల గనుల్లో పనిచేసే కార్మికులు గనులవద్ద నిరసన వ్యక్తం చేశారు. గోదావరిఖని పట్టణంలో రవాణా వ్యవస్ధ పూర్తిగా స్థంభించింది.వ్యాపార, వాణిజ్య విద్యాసంస్ధలు స్వచ్చంధంగా మూసివేశారు.