తుఫాన్ సినిమా ప్రదర్శనను అడ్డుకున్న తెలంగాణ వాదులు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో తుఫాన్ సినిమాకు పలుచోట్ల అడ్డంకులు ఎదురయ్యాయి, కరీంనగర్‌లోని కులసంఘాల జేఏసీ ఆద్వర్యంలో ఉద్యమకారులు థియేటర్‌లోకి దూసుకురావడమే కాకుండా సినిమా పోస్టర్లను చింపివేశారు. ప్రదర్శన నిలిపివేయాలని నినాదాలు చేశారు. పెద్దపల్లి ,హుజురాబాద్ ,మెట్‌పల్లి లో సినిమా ప్రదర్శనకు ముందు తెలంగాణ వాదులు ధర్నాలు చేశారు.