సీఎం కిరణ్‌ సీమాంధ్రకు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు.: టీఆర్‌ఎస్‌ ఎంపీ వివేక్‌

కరీంనగర్‌ :ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర తొత్తుగా వ్యవహరిస్తున్నాడని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ ద్వజమెత్తారు. నిన్నటి ఘటనలతో తెలంగాణ ప్రాంత మంత్రులు ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కళ్లు తెరవాలని ఆయన తెలంగాణ ప్రాంత నేతలకు సూచించారు.సీఎం కిరణ్‌ సీమాంధ్ర ప్రాంతానికి ఏక పక్షంగా వ్యవహరిస్తున్నడని ఆయనను వెంటనే బర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.