విద్యార్థులపై దాడిని ఖండించిన గీతారెడ్డి
కరీంనగర్ : ఏపీఎన్జీవోల సభ సందర్భంగా తెలంగాణ విద్యార్థులపై జరిగిన దాడిని మంత్రులమంతా తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి గీతారెడ్డి తెలిపారు. విద్యార్ధులపై దాడులకు పాల్పడ్డవారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీవోలు మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని చెబుతుంటే సీఎం ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. నిన్న జరిగిన ఘటనలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని గీతారెడ్డి తెలిపారు.