ప్రపంచ శతాధిక వృద్ధుడు శాంచెజ్ మృతి
న్యూయార్క్ : గిన్నిస్ రికార్డుల ప్రకారం ప్రపంచంలో శతాధిక వృద్ధుల్లో పెద్దవాడైన సలుస్టియానో శాంచెజ్(112) శనివారం మృతిచెందారు. జపాన్‌కి చెందిన 116ఏళ్ల కిమురా మృతి తర్వాత శాంచెజ్‌ని ‘ఓల్డెన్ట్ మ్యాన్’ అని గిన్నిస్ రికార్డుల సంస్థ ప్రకటించింది. రోజూ ఒక అరటి పండు తినడం, అనాసిన్ మాత్ర వేసుకోవడం తన ఆరోగ్య రహస్యాలని శాంచెజ్ గిన్నిన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. శాంచెజ్ మృతి తర్వాత ప్రపంచ ఓల్డెన్ట్ మ్యాన్ హోదా ఇప్పుడు ఇటలీకి చెందిన 111 ఏళ్ల లికాటాకు దక్కింది. జపాన్‌కు చెందిన మిసావో ఒకావా (115) ఓల్టెన్ట్ ఉమన్‌గా ఉన్నారు.