అంధకారంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్
కరీంనగర్ : ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే జిల్లా కలెక్టరేట్ చీకట్లు కమ్ముకుంది. విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు కరెంటు సరాఫరాను నిలిపివేశారు.కలెక్టరేట్‌లోని వివిధ శాఖలలో పేరుకుపోయిన బకాయిలను చెల్లించకపోవడంతో కరెంటు సరాపరాను నిలిపివేశారు.జిల్లాలోని కలెక్టరేట్‌లో సుమారు 42 శాఖల కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో కేవలం జిల్లా కలెక్టర్ చాంబర్, జాయింట్ కలెక్టర్ ,డీఆర్వో ,డీఆర్టీఏ , డ్వామా పీడి కార్యాలయాలు మినహా మిగతా శాఖల కార్యాలయాలకు విద్యుత్ సరాఫరా నిలిపివేసి మీటర్‌ను సీల్ చేశారు. దీంతో విద్యుత్ లేక కలెక్టరేట్ ప్రాంగణం చీమ్మ చీకట్లు కమ్ముకుంది.