ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకుంటే ప్యాన్లు : ఎంపీ పొన్నం

కరీంనగర్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం త్వరగా పూర్తి చేసుకున్నవారికి ఇంటికో ఫ్యాన్‌ ను అందజేయనున్నట్లు కరీనంగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ లబ్దిదారులకు హామి ఇచ్చారు.మంగళవారం ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో ట్యాంక్‌ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.రక్షిత మంచినీటి కోసం 60వేల లీటర్ల సామర్ధ్యంతో 39.50లక్షలతో మంజూరైన ట్యాంక్‌ మంచినీటి కొరత తీర్చనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సర్పంచి నల్ల నర్సయ్య ,ఉపసర్పంచి శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.