మరో నేతన్న బలవన్మరణం
కరీంనగర్ : రెక్కలు ముక్కలు చేసుకుంటేనే బుక్కెడు బువ్వ దొరికే బతుకులు వారివి. భార్యాభర్తలిద్దరు శ్రమిస్తేనే ఇల్లు గడుస్తుంది.గల్ప్ వెళ్లేందుకు చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి ఆనేత కార్మికుడి ఉసురు తీశాయి. అద్దకం పరిశ్రమలో పొద్దంతా శ్రమించినా బట్టకు పొట్టకు సరిపోకపొవడంతో అప్పులు తీర్చే మార్గం లేక నేత కార్మికుడు నైట్రాప్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.