తెలంగాణ కార్మికులకు బోనస్‌ ఎందుకివ్వరు ? : పొన్నం

కరీంనగర్‌ : సమ్మె సీమాంధ్రలో జరిగితే తెలంగాణ కార్మికులకు దసరా బోనస్‌ ఎందుకివ్వరని కరీంనగర్‌ ఎంపీ పొన్న ం ప్రభాకర్‌ ప్రశ్నించారు. సింగరేణీ ,ఆర్టీసీ కార్మికులకు బోనస్‌ ఇవ్వకపోవడం అన్యాయమని ఆయన అన్నారు.తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ అని తెలిపారు. సీమాంధ్రలో సమ్మె జరుగుతున్నందున తెలంగాణ కార్మికులకు బోనస్‌ ఇవ్వలేమని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే.