ఓటరు అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్‌

కరీంనగర్‌ : ఓటర్‌ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ వీరబ్రహ్మయ్య బుధవారం ప్రారంభించారు.ఎన్టీపీసిలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ర్యాలీని ప్రారంభించిన ఆయన కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి ,తహసిల్దార్‌ ,విద్యార్ధులు పాల్గొన్నారు.