ఎన్టీపీసీలో తగ్గుతున్న బొగ్గు

కరీంనగర్‌ : ఎన్టీపీసీ రామగుండం విద్యుత్‌ సంస్థలో రోజురోజుకు బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. ఉత్పత్తి సామర్ధ్యాన్ని తగ్గించి విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బుధవారం వరకు 60వేల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. అనుకున్న స్థాయిలో సింగరేణి నుంచి బొగ్గు ఎన్టీపీసికి చేరడం లేదు.సింగరేణీ నుంచి ఈ నెల 22న 8167టన్నులు,23న 4575టన్నులు చేరింది. గత మూడు రోజుల వరకు 1900 మెగావాట్ల సామర్ధ్యంతో నడిపిన ఎన్టీపీసీలో బుధవారం నుంచి 1800 మెగావాట్ల సామర్ధ్యంతో విద్యుత్‌ ఉత్పత్తిని తీస్తున్నారు.