కరీంనగర్‌లో ఎలుగుబంటి సంచారం
కరీంనగర్ : అభయారణ్యంలో ఉండాల్సిన ఎలుగుబంటి శనివారం కరీంనగర్‌లో దర్శనమిచ్చింది. పట్టణంలో కలియతిరుగుతూ దాదాపు 8గంటల పాటు ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.శుక్రవారం రాత్రి 10.30గంటల ప్రాంతంలో కిసాన్‌నగర్ పరిసర ప్రాంతాల్లోకి ఎలుగుబంటి రావడంతో స్ధానికులు కర్రలతో తరిమి కొట్టారు. ఆతర్వాత నగరంలోకి ప్రవేశించి రాత్రంతా హడావుడి చేసింది.తెల్లవారుజామున కరీంనగర్ ఎస్పీ కార్యాలయం ,జూనియర్ కళాశాల మైదానం సమీపంలో సంచరించి అటవీ శాఖ కార్యాలయానికి చేరింది.అప్రమత్తమైన అటవీ అధికారులు చాకచక్యంగా ఎలుగుబంటిని గదిలో బందించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.