ఉద్యోగం రాలేదని కలతచెంది యువకుని ఆత్మహత్య
జమ్మికుంట (కరీంనగర్) : జమ్మికుంట మండలం మాచనపల్లికి చెందిన పర్లపల్లి ప్రభాకర్ (26) అనే యువకుడు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఎంబీఏ పూర్తి చేసి రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటున్నాడు.ఉద్యోగాలకు ప్రయత్నించినా ఫలితం పోయిందని మృతుని తల్లిదండ్రులు చిలుకమ్మ, రాజయ్యలు తెలిపారు.పురుగుల మందు తాగిన ప్రభాకర్‌ను స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసిన ఫలితం లేకపోగ చికిత్సకు వరంగల్‌కు తరలిస్తుండగా మృతి చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు.