కరీంనగర్‌లో చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు : ఐదుగురు నిందితుల్ని పట్టుకున్న స్థానికులు
కరీంనగర్ : ప్రభుత్వ ప్రధానుపత్రిలో దొంగలు పడ్డారు. అలాంటి ఇలాంటి దొంగలు కాదు. ఏకంగా చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే కేడీలు. ఆరుగురు సభ్యులు గల ముఠా ఆసుపత్రిపై కన్నేసి పిల్లలను ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. ఇద్దరు మహిళలతోపాటు నలుగురు పురుషులు అనుమానాస్పదంగా తిరగడంతో పేషెంట్ బంధువులకు అనుమానం వచ్చి నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ముఠా సభ్యులు పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు ఐదుగురిని పట్టుకుని దేహశుద్ది చేసి, పోలీసులకు అప్పగించారు.పట్టుబడ్డ ఐదుగురు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాగలక్ష్మి, గరిఖీ, కదరి దయానంద్, న్యాదర్ సుమన్, గాదరి మదన్‌లుగా గుర్తించారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు.