సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించాలంటూ కార్మికుల నిరాహారదీక్ష
గోదావరిఖని : సింగరేణి కార్మికులకు లాభాల్లో 25శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆద్వర్యంలో గోదావరిఖనిలో దీక్ష చేపట్టారు. సింగరేణి జీఎం కార్యాలయం ముందు 500 మంది కార్మికలు దీక్షలో కూర్చుని నిరసన తెలిపారు. దీక్షలను తె.బొ.గ.కా.స అధ్యక్షలు మల్లయ్య ప్రారంభించారు.