కుప్పకూలిన అమెరికా ఆర్ధిక వ్యవస్థ .. ప్రభుత్వం మూత

వాషింగ్టన్‌: అమెరికాలో అత్యంత తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం తలెత్తింది.ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని మూసేయాలని వైట్‌ హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదేశించింది.బడ్జెట్‌ బిల్లు సెనెట్‌లో ఆమోదం పొందకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.కాంగ్రెస్‌ సమయానికి స్పందించి ,అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా రేపటికి సంతకం చేస్తారో లేదో ఇంకా తెలియదని అందువల్ల ప్రస్తుతానికి ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని మూత పెట్టాలని వైట్‌ హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ సిల్వియా బర్వెల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్‌ వీలైనంత త్వరగా స్పందించి తాత్కాలికంగా ఓ బడ్జెట్‌ను ఆమోదించాలని అప్పుడు మిగిలిన ఆర్ధిక సంవత్సరానికి కావాల్సిన బడ్జెట్‌ను కొంత సమయం తీసుకున్న తర్వాత ఆమోదించాలని దానివల్ల ప్రభుత్వ సేవలన్నింటిని త్వరగా పునరుద్దరించే అవకాశం ఉంటుందని లేనిపక్షంలో తీవ్ర ప్రభావం కలిగే ప్రమాదముందని బర్వెల్‌ అన్నారు. గడిచిన 17 సంవత్సరాల్లో అమెరికా ప్రభుత్వం మూతపడడం ఇదే మొదటిసారి. చిట్టచివరిసారిగా 1996లో క్లింటన్‌ ప్రభుత్వానికి రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్‌కు మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కూడా బడ్జెట్‌ ఆమోదం పొందలేదు.