చైనాను తాకనున్న తుఫాన్‌ : రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

బీజింగ్‌ : చైనా ఈరోజు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఫిటో తుపాన్‌ దేశ తూర్పు తీరాన్ని తాకనున్న నేపథ్యంలో వేలాదిమందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఏడాది చైనా ఇప్పటికే 22 తూపానులు చూసింది. 23వ తుపాన్‌ ఫిటో సోమవారం ఉదయం తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం అధికారులు పేర్కొన్నారు. ఈ తుఫాన్‌ సమయంలో సముద్రంలో అలలు 10 మీటర్ల ఎత్తున లేస్తాయని ,తీరప్రాంతంలో రెండు మీటర్ల మేర నీటి స్థాయి పెరిగే అవకాశం ఉందని సమాచారం, దాంతో తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాక సందరశకులను పూర్తిగా నిషేదించారు.