7న హైదరాబాద్‌కు ప్రధాని
` బీసీ ఆత్మగౌరవ సభకు హాజరు
హైదరాబాద్(జనంసాక్షి):ఈనెల 7వ తేదీన హైదరాబాద్‌లో బీజేపీ పార్టీ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈమేరకు బీజేపీ అధిష్ఠానం అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ మేరకు విూడియాకు వివరాలు తెలిపారు. యావత్ సమాజం సభకు హాజరుకావాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. బీజేపీ ప్రకటనతో బీసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీసీలు రెడీగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా బీసీలు బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. బీసీల చిరకాల వాంఛ ముఖ్యమంత్రి పదవి. బీసీ ముఖ్యమంత్రి ప్రకటనను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు అవహేళన చేస్తున్నాయి. ఏఐసీపీ అగ్రనేత రాహుల్ గాంధీ, మంత్రి కేటీఆర్‌లు బీసీ సీఎం ప్రకటన పై వ్యగ్యంగా మాట్లాడారు. రాహుల్ గాంధీ, కేసీఆర్, కేటీఆర్ల మెడలు వంచాలని బీసీ సమాజాన్ని కోరుతున్నాను. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ము బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉందా అని లక్ష్మణ్ సవాల్ విసిరారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎంను చేస్తామని కేంద్రం హోం మంత్రి అమిత్ షా ప్రకటించారని, ఆ నిర్ణయాన్ని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతున్నాయని లక్ష్మణ్ అన్నారు.తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో బీసీలను అన్ని విధాలుగా అణచివేశారని, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని ఆరోపించారు. ’బీసీ వ్యక్తి సీఎం అయ్యేది లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అవహేళన చేశారని గుర్తు చేశారు. బీసీల అభ్యున్నతి కోసం ఒక్క కమిషన్ కూడా వేయని కాంగ్రెస్ ఇప్పుడు వారి పట్ల మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎంగా చేస్తామని, బీఆర్‌ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ చెప్పగలవా.? అంటూ నిలదీశారు. బీసీల అభ్యున్నతి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. బీసీల సాధికారత కోసం కట్టుబడి ఉన్నామని, బీజేపీ ప్రకటించిన 88 మంది అభ్యర్థుల్లో 31 మంది బీసీలకు టికెట్లు కేటాయించామని చెప్పారు. అధికారంలోకి రాగానే బీసీ సబ్ ఎª`లాన్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 7న బీసీ ఆత్మ గౌరవ సభ, 11న ఎస్సీ వర్గీకరణపై సభ ఉంటుందని వివరించారు. ప్రధాని మోదీ ఈ సభలకు హాజరవుతారని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఆయన నవంబర్ 7న రాష్టాన్రికి రానున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొననున్నారు. ఆ రోజు సాయంత్రం ఢల్లీి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో సాయంత్రం 5:05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి వచ్చి, 5:30 నుంచి 6:10 వరకూ సభలో ప్రసంగిస్తారు. అనంతరం సభ ముగించుకుని 06:35కు తిరిగి ఢల్లీి పయనమవుతారు. ఈ క్రమంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, ఈ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, దాదాపు లక్ష మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ ప్రతినిధుల బృందం సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.