ఐపీఎల్-7 పై గవాస్కర్ సీరియస్

(జ‌నంసాక్షి): బిసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ ఐపీఎల్-7ను సీరియస్ గా తీసుకున్నారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ తో క్రికెట్ కు మచ్చ తెచ్చిన ఐపీఎల్ కు మళ్లీ క్రేజ్ ను తెచ్చేందుకు గవాస్కర్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు రానున్న ఐపీఎల్-7లో తనకు అడ్వైసర్ గా HDFC ఛైర్మన్ దీపక్ పరేక్ ను నియమించుకున్నాడు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిలింగ్ మీటింగ్ జరుగుతున్న సమయంలో పరేక్ ప్రత్యేక ఆహ్వానం ద్వారా మీటింగ్ లో పాల్గొంటాడన్న గవాస్కర్… ఆర్థిక వ్యవహారాల్లో నిపుణుడైన దీపక్ పరేక్ అనుభవం ఐపీఎల్ కు ఉపయోగపడుతందన్నాడు.