7.5 శాతం వృద్ధిరేటు సాధ్యంకాదు- జైట్లీ

న్యూఢిల్లీ,ఆగష్టు 11(జనంసాక్షి): ప్రస్తుత పరిస్థితుల్లో 7.5 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించడం అసాధ్యమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. రైతు రుణలకు మాఫీ కల్పించడం వల్ల వృద్ధి రేట?ను సాధించడం కుదరదని నివేదిక పేర్కొంది. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆర్థిక సర్వే 2016-17 వాల్యూం -2 ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలికసదుపాయాలు, విద్య, ఆరోగ్యం లాంటి రంగాల్లో సంస్కరణలు అత్యవసరమని ఆర్థిక సర్వే సూచించింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ధరల నియంత్రణ కోసం మార్కెటింగ్‌ మౌళిక సదుపాయాలను స్థిరీకరించాలని నివేదిక తెలిపింది. పంటల దిగుబడి, రైల్వే ఆదాయాన్ని పెంచాలని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. మధ్య తరహా పోర్టుల అభివృద్ధి, ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ అవసరమని వెల్లడించింది. భారత ఆర్ధికవ్యవస్థ లోని వివిధ అంశాలపై దృష్టి పెట్టిన సర్వే దేశం ఆర్ధిక పరిస్థితుల నిర్వహణ తదితర అంశాలపై నివేదించింది. ముఖ్యంగా జీఎస్‌టీ లో నిర్మాణాత్మక సంస్కరణలు, నోట్ల రద్దు తదనంతర పరిణామాలను చర్చించింది. అలాగే ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ సహా, పలు రంగాల్లో సంస్కరణలు చేపట్టాలని ఆ సర్వే నివేదిక ప్రతిపాదించింది. దీంతో పాటు భారతదేశ ఆర్ధికవ్యవస్థ ప్రస్తుత స్థితి, మొత్తం వాణిజ్యం, బాహ్య రుణం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్‌డీఐ కింది విదేశీ నిధుల ప్రవాహం తదితర అంశాలపై నివేదికలో ఆర్థిక సర్వే వివరించింది. నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తూ, భారత ఎగుమతులు 2016-17 నాటికి 12.3 శాతం వద్ద సానుకూలంగా మారాయి. దిగుమతులు 1.0 శాతం పెరగడంతో 2016-17 నాటికి వాణిజ్య లోటు 112.4 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 2015-16 నాటికి ఇది 130.1 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక లోటు 2016-17 నాటికి జీడీపీ 0.7 శాతం వరకు పెరిగింది. 2015-16లో 1.1 శాతం నుంచి వాణిజ్య లోటులో పదునైన సంకోచం ఏర్పడింది. 2013-14 నుంచి 2015-16 మధ్య కాలంలో చెల్లింపుల పరిస్థితిని నిరుపయోగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక లోటు తగ్గడంతో 2016-17లో మరింత మెరుగుపడింది. విదేశీ మారకద్రవ్యం మరింత పెరిగిందని ఆర్థిక సర్వే పేర్కొంది. అయితే 2017-18 సంవత్సరానికి పెట్టుకున్న జీడీపీ టా/-గ్గం/ట్‌ రేటును అందుకోవడం పెద్ద సవాల్‌ అని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యన్‌ వెల్లడించడం గమనార్హం.