70 లక్షల 41వేల అంచనా బడ్జెట్ ఆమోదం

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్28 జనంసాక్షి;;
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం
ముత్యంపేట విండో మహాజన సభ
70 లక్షల 41 వేల అంచనా బడ్జెట్ ను ముత్యంపెట సింగిల్ విండో మహాజన సభ బుదవారం రోజున ఆమోదించింది. సొసైటీ చైర్మన్ కొడిప్యక తిరుపతి గౌడ్ సభకు అధ్యక్షత వహించారు. సొసైటీ కీ ఈ ఆర్థిక సంవత్సరంలో 18కోట్ల 74లక్షల 50వేల ఆదాయం రాగా,18 కోట్ల 75 లక్షల 52 వేల రూపాయల ఖర్చు చేశామనీ విండో అధ్యక్షులు తిరుపతి గౌడ్ చెప్పారు.కోటి 7లక్షల రూపాయలతో ఎరువులు, విత్తనాల తాటిపత్రుల వ్యాపారం చేశామన్నారు.84.47 లక్షల తో వరి పంట కోనుగోలు, రవాణా చార్జీలు హామాలీ ఖర్చులు లావాదేవీలు నిర్వహించామన్నారు.   22_23 ఏడాదికి అంచనా బడ్జెట్ ఆమోదం చేశారు. ఎరువుల, విత్తనాల వ్యాపారం  లాభ సాటిగా సాగిందన్నారు. సీ ఈ వో రామచంద్రం వార్షిక నివేదిక సమర్పించారు.66 లక్షల రూపాయల రుణాలు కొత్త రైతులకు పంపిణీ చేశామన్నారు. 6శాతం అపరాధ వడ్డీ తో రైతుల పై 3 రెట్ల వడ్డీ భారం పడుతుందనీ చెప్పారు.
Attachments area