నేడే భారత్‌ ,ఆస్ట్రేలియా మూడో వన్డే

మొహాలీ: భారత్‌ ఆస్ట్రేలియా మద్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో నేడు మొహాలిలో మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా బౌలర్లు ఆదిపత్యం వహిస్తారా ? లేదంటే తొలిరెండు వన్డేల తరహాలోనే పరుగుల ప్రవాహంలో కొట్టుకుపోతారా ? వేచిచూడాల్సిందే.ఏడు వన్డేల సిరీస్‌లో 1-1 తో సమవుజ్జీవులుగా ఉన్న భారత్‌ -ఆస్ట్రేలియా జట్లు శనివారం మూడో వన్డే కోసం తలపడనున్నాయి.