తెలంగాణ తుపాన్‌ను అడ్డుకుంటే సీఎం బలైపోతారు : ఎంపీ పొన్నం

కరీంనగర్‌ : విభజన తుపాన్‌ను అడ్డుకుంటానన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రళయానికి బలైపోతారని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ బదులిచ్చారు. సీఎం కిరణ్‌ ప్రభుత్వంపై రెండుసార్లు అవిశ్వాసం తీర్మానం పెట్టినా సీమాంధ్ర నేతల్లాగా తాము కాంగ్రెస్‌ను వీడలేదని గుర్తు చేశారు. జేపీ రాజకీయ నేతలను గాడిదలతో పోల్చడం సరికాదని మండిపడ్డారు.