టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తుల రాళ్లదాడి
రాంచీ : సొంత మైదనంలో నిన్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రత్యర్ధి జట్టుకు బ్యాటింగ్ అప్పగించడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో నిరాశ చెందారు. దీంతో కోపోద్రిక్తులయిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ధోని ఇంటిపై రాళ్లు విసిరారు. స్థానిక హార్మూ హౌసింగ్ కాలనీలో ఉన్న ధోని ఇంటిపై రాళ్లు విసిరారు. ఘటనలో ఇంటి కిటికీ అద్దాలు పగిలిపోయాయి.