సిరిసిల్లలో టీఆర్‌ఎస్ నేతల పర్యటన
కరీంనగర్ : సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నేతలు పర్యటిస్తున్నారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న బాధిత రైతులకు తమ వేతనాలు నుంచి రూ.26 లక్షలు పరిహారాన్ని టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఈ సంధర్భంగా ఎంపీ వివేక్ మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ,నీలం తుపాన్ బాధితులను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ధైర్యం చెప్పేందుకే వచ్చామని ఆయన పేర్కొన్నారు.