కరుణించని వరుణుడు :భారత్‌, ఆసీస్‌ ఐదో వన్డే రద్దు

కటక్‌ : వర్షం కారణంగా భారత్‌,ఆసీస్‌ మధ్య ఇవాళ జరగాల్సిన ఐదో వన్డే రద్దయ్యింది. భారత్‌ ,ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ కటక్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. మూడ్రోజుల నుంచి వర్షాల కారణంగా బారాబతి మైదానంలో భారీగా వర్షపు నీరు చేరింది.