సెంచరీ సాధించిన బెయిలీ
నాగ్‌పూర్ : భారత్‌లో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ బెయిలీ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కీలక సమయంలో వాట్సన్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు సెంచరీ సాధించి జట్టును పటిష్టస్థితిలో నిలిపాడు. 86 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో బెయిలీ 102 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతనితో పాటు వోజెస్ (5) క్రీజులో ఉన్నాడు. 41 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది.