లారీ – ఆటో ఢీ ముగ్గరు మృతి
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం చెక్‌పోస్టు సమీపంలో లారీ – ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.



