గోదావరిలో విద్యార్థి గల్లంతు పండుగ పూట విషాదం

కరీంనర్‌ : (కాటారం) : దీపావళి పర్యదినాన్ని పురస్కరించుకుని గోదావరిలో స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. కరీంనగర్‌ జిల్లా కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన చీర్లమహేష్‌ (16) ఆదివారం ఉదయం స్థానికులతో కలిసి గోదావరిలో స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి కొట్టుకుపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహేష్‌ కోసం స్థానికులు గాలిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు గోదావరిలో గల్లంతుకావడంతో తల్లి బుచ్చప్ప కన్నీరుమున్నీరవుతున్నారు.