నేడు హైదరాబాద్‌కు అదనపు బస్సులు
కరీంనగర్ : దీపావళి పండుగ జరుపుకోవటానికి సొంత ఊళ్లకు వచ్చిన ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు సోమవారం 80 అదనపు బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు. ఇవి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి సికింద్రాబాద్ జేబీఎస్ బస్సు స్టేషన్ వరకు నడుస్తాయని , ప్రయాణికులు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. అయితే ఈ బస్సులకు అదనపు ఛార్జీలు ఏమీ ఉండవని ,రోజువారీ ఛార్జీలే వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.