జాతీయ విపత్తుగా ప్రకటించాలి : ఈటెల
కరీంనగర్ : అకాల వర్షాలను ప్రభుత్వం జాతీయవిపత్తుగా ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన జమ్మికుంటలోని మార్కెట్ యార్డ్‌ను సందర్శించారు. వర్షాలకు తడిసి రంగు కోల్పోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఆయన కోరారు. నష్టపోయిన పత్తి పంటలకు క్వింటాలుకు రూ. 5,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికుందని ఆయన గుర్తు చేశారు.