తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

కోల్‌కతా : ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్‌, విండీస్‌ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌ తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమి నష్టపోకుండా 37 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. 42పరుగుల వద్ద శిఖర్‌ ధావన్‌ (23) అవుటయ్యాడు.