తనదైన ఆటతీరుతో అభిమానులను అలరించిన సచిన్‌

ముంబయి : ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌ తొలిరోజు సచిన్‌ తనదైన ఆటతీరు. ట్రేడ్‌మార్క్‌ షాట్లను ప్రదర్శించి అభిమానులను అలరించాడు. భారత్‌ – వెస్టిండీస్‌ మధ్య తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. సచిన్‌ 38, పుజారా 34 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.