ట్రాలీ ఢీకొని రైతు దుర్మరణం

ధర్మారం: కరీంనగర్‌ జిల్లాలో జగిత్యాల-పెద్దపల్లి ప్రధాన రహదారిపై ధర్మారం మండలంలోని నర్సింహులపల్లి వద్ద ట్రాలీ ఢీకొని కోట రాజిరెడ్డి (48) అనే రైతు మృతి చెందాడు. పెద్దపల్లి వైపు నుంచి నస్తున్న ట్రాలీ సైకిల్‌పై వెళుతున్న రైతును వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో రాజిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌.ఐ ప్రవీణ్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.